ఆ రీమేక్ పైనే ఆశలు పెట్టుకున్న `తార`
on Mar 3, 2021
`స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2`తో బాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది తారా సుతారియా. 2012 బ్లాక్ బస్టర్ `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్`కి సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద జస్ట్ ఓకే అనిపించుకుంది. ఆ తరువాత వచ్చిన `మార్జావాన్` కూడా సేమ్ ఫీట్ రిపీట్ చేసింది. దీంతో.. తదుపరి చిత్రాలపైనే ఆశలు పెట్టుకుంది తార. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి `తడప్` కాగా.. మరొకటి `ఏక్ విలన్ రిటర్న్స్`. వీటిలో `తడప్` కోసం కెరీర్ లో ఫస్ట్ టైమ్ సోలో హీరోయిన్ గా నటించింది తార.
రెండున్నరేళ్ళ క్రితం తెలుగునాట సంచలనం సృష్టించిన రొమాంటిక్ డ్రామా `ఆర్ ఎక్స్ 100`కి రీమేక్ వెర్షన్ నే ఈ `తడప్`. సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టి కథానాయకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మిలన్ లూథ్రియా డైరెక్ట్ చేస్తున్నాడు. సునీల్ శెట్టి, శరత్ సక్సేనా ఇతర ప్రధాన పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. మరి.. `ఆర్ ఎక్స్ 100` రీమేక్ పైనే ఆశలు పెట్టుకున్న తారకి ఈ సారైనా సాలిడ్ హిట్ దొరుకుతుందో లేదో చూడాలి.
Also Read